తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కీ పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి


*తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి*

*చంద్రగిరి జనసేన సీనియర్ నాయకులు డిమాండ్*

గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం,లడ్డూలో వాడే నెయ్యలో జంతువుల కొవ్వుతో తయారయ్యే నెయ్యను కలపడం బాధాకరమని చంద్రగిరి జనసేన సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు గారు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తిరుమల నుండే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి శ్రీవారి భక్తులు ఇష్టంగా స్వీకరించే శ్రీవారి లడ్డూలో జంతు కళేబరాలు మరియు కొవ్వుతో చేయబడే నెయ్యను ఉపయోగించారని తేలడం జరిగింది. శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశాన్ని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరిగింది. ఈ వ్యవహారానికి ప్రథమ సూత్రధారులు ధర్మారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లను విచారిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన పార్టీ సీనియర్ నాయకులు తపసి మురళి రెడ్డి, గోపినాథ్ రాయల్, పొర్లు దండాల ఈశ్వర రాయల్, దండు లక్ష్మీపతి,డి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements

You May Like This