తిరుపతి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ముంపు ప్రాంతాలలో కొనసాగుతున్న సహాయక చర్యలు


*తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ముంపు ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలు*

*యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాం.*

**కమిషనర్ ఎన్.మౌర్య*

విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. విజయవాడను వరద ముంచెత్తిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు బుధవారం రాత్రి కమిషనర్ ఆధ్వర్యంలో 80 మంది పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్, హెల్త్ అధికారులు విజయవాడకు వెళ్లారు. విజయవాడ 15 డివిజన్ లోని రామలింగేశ్వర్ కట్ట, రంజిత్ భార్గవ్ రోడ్, గాంధీ కాలనీ, ఈనాడు కాలనీ, శివశంకర్ రోడ్ తదితర ప్రాంతాల్లో గురువారం తెల్లావారుజామునుండే సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం నుండి కాలువల్లో పేరుకుపోయిన బురద, చెత్త తొలగింపు, ఎక్కడికక్కడ ఆగిపోయిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు. అంటువ్యాదులు ప్రబలకుండా అన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లి, ఫాగింగ్ చేయిస్తున్నారు. శని, ఆదివారాల్లో జోరువర్షం కురుస్తున్నా సిబ్బంది పనులు చేశారు. అన్ని పనులు పర్యవేక్షిస్తున్న కమిషనర్ మౌర్య ఇంటింటికి వెళ్లి బాధితులకు కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఇంటివద్దకే వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించడం పట్ల కమిషనర్ కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. వరదలతో బురదలో జీవిస్తున్న తమకు విముక్తి కల్పిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటువ్యాదులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిషన్ మౌర్య నేతృత్వంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సహాయం చర్యల్లో మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, ఆరోగ్యాశాఖధికారి డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ. లు సంజయ్ కుమార్, మహేః, రాజు, నరేంద్ర, రవీంద్ర రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements