తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో పాలకవర్గం నియామకం


కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అతి త్వరలో టిటిడి పాలకవర్గాన్ని నియమించనుంది.

ఇప్పటికే రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఓ మీడియా ఛానల్ అధినేత పేరు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం సాగుతోంది.మరోవైపు అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసి పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి పేరు సైతం వినిపిస్తోంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైన నేపథ్యంలో టీటీడీ పాలకవర్గాన్ని సైతం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించినట్లు సమాచారం.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. టీటీడీ అధ్యక్షుడిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. వెనువెంటనే ప్రభుత్వం సైతం ప్రక్షాళన ప్రారంభించింది. టీటీడీ ఈవోగా శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. జేఈవోగా 2005 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని భక్తి చేసింది. ఇప్పుడు టీటీడీ జేఈఓ గా జైళ్ళ శాఖలో కోస్తాంధ్ర రేంజ్ డిఐజి ఎంఆర్ రవికిరణ్ నియమితులు కానున్నట్లు సమాచారం. టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేయాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే టీటీడీ అధ్యక్ష పీఠాన్ని పవర్ ఫుల్ వ్యక్తికి అప్పగించాలని చూస్తోంది.అదే సమయంలో అధికారుల బృందాన్ని కూడా నియమిస్తోంది.తనకు టీటీడీ జేఈఓ గా అవకాశం ఇవ్వాలని జైల శాఖ డిఐజి రవికిరణ్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.అందుకే ఆయన నియామకానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్లు సమాచారం.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements