తిరుపతి పద్మావతి నగర్ లో విషాదం


*తిరుపతి జిల్లా…*

*తిరుపతి పద్మావతి నగర్ లో విషాదం !*

అన్న పిల్లలు దేవిశ్రీ, నీరజ లతో పాటు అన్న భార్య వదిన సునీత ను హత్య చేసి, ఆపై ఆత్మహత్య చేసుకున్న గుడిమెట్ల మోహన్ అని ఒక సాఫ్టువేర్ ఇంజనీర్.

ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన జిల్లా ఎస్పీ,

హత్యలపై సమగ్ర విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారు.

కుటుంబ కలహాలతో అన్న భార్య, పిల్లలను హతమార్చిన తమ్ముడు ???.

హత్యలు జరిగిన సమయంలో ఇంటిలో ఎవరెవరు ఉన్నారు.. అనేదానిపై పూర్తి వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశించిన జిల్లా ఎస్పీ గారు.

ఘటనా స్థలంలో కొన్ని కీలక ఆధారాలను సేకరించిన క్లూస్ టీం.

సొంత మరిదే వదినను, అన్న పిల్లలను హత్య చేసేందుకు గల కారణాల గురించి వివిధ కోణాలలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఎస్వీయూ పోలీసులు.

ఘటనా స్థలానికి చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రైవేటు సీసీ కెమెరాలను, పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానమైన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు.

అదనపు ఎస్పీలు శ్రీ కులశేఖర్, శ్రీమతి విమల కుమారి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు.

బ్లూ కోల్ట్స్, రక్షక్ పోలీసులు రేయింబవళ్లు ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచి, సమర్థవంతంగా గస్తీ కాయాలని అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలని, బీట్ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని ఎస్వీయూ పోలీసులను ఆదేశించిన జిల్లా ఎస్పీ గారు.

సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో అదనపు ఎస్పీలు శ్రీ కులశేఖర్ శాంతిభద్రతలు, శ్రీమతి విమల కుమారి నేర విభాగం, తిరుపతి డిఎస్పి రవి మనోహర్ ఆచారి, ఎస్బి డిఎస్పి వెంకటాద్రి, ఎస్వీ యూనివర్సిటీ సీఐ మురళీమోహన్ రావు మరియు తిరుపతి సబ్ డివిజన్ ఐడి పార్టీ పోలీసులు నిమగ్నమై ఉన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements