గత కొన్నేళ్లుగా ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ప్రాణాంతకమైన బ్యాక్టీరియాలు పుడుతూనే ఉన్నాయి. కరోనా వంటి డేంజరస్ వైరస్ కారణంగా ప్రపంచం అతలాకుతలం అయ్యింది. అయితే తాజాగా మరో ప్రాణాంతక బాక్టీరియా జపాన్లో కలకలం రేపుతోంది.
జపాన్లో కొత్త బాక్టీరియా కలకలం సృష్టిస్తోంది. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్(STSS) బ్యాక్టీరియా జపాన్లో గత కొన్ని రోజులుగా కలకలం రేపుతోంది. ఈ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన శరీరంలోని మాంసాన్ని తింటూ 48గంటల్లోనే మనిషిని చంపేస్తుందని అక్కడి శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఫాదర్స్ డే రోజున ఇలాంటి పనులతో మీ నాన్నను సర్ప్రైజ్ చేయండి..!
ఈనెల 2వ తేదీ నాటికి 977 మందికి సోకగా, ఏడాది చివరికి 2,500 మందికి వ్యాపించొచ్చని అధికారులు తెలిపారు. మనిషి శరీరంలోనే జీవించే ఈ బ్యాక్టీరియా చర్మవ్యాధులు, గాయాలు, శస్త్రచికిత్సలు జరిగినప్పుడు రక్తనాళాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2.8 రెట్లు పెరుగుదలను నమోదు చేసిందన్నారు.
రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
STSS ప్రధానంగా “గ్రూప్ A స్ట్రెప్టోకోకస్” బాక్టీరియం వల్ల కలుగుతుంది. వారి 30 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది శరీరంలోని పలు అవయవాలను నాశనం చేస్తుంది. ఈ బాక్టీరియా సోకిన వారిలో జ్వరం , దద్దుర్లు , చర్మం పొట్టు, తక్కువ రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిశుభ్రత ద్వారా దీని నుంచి రక్షించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..