ఓరుగల్లు కాకతీయుల అద్భుత కళా సంపదకు పెట్టింది పేరు. ఆ కాకతీయులు, కోటలు, దేవాలయాలు, చెరువులకే కాదు పలుచోట్ల బావులను కూడా నిర్మించారు. ఇలా వరంగల్ లో కాకతీయ రాజులు నిర్మించిన బావులు 300 పైగా ఉన్నట్లు ఆ చరిత్రకారులు చెబుతారు. అందులో ఈ మెట్ల బావి ఒకటి. దీనిని శృంగార బావి, బహుళ అంతస్తుల బావి అని కూడా పిలుస్తారు.
వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతంలో ఈ మెట్ల బావికి ఎంతో చరిత్ర ఉంది. 11 శతాబ్దంలో ఆ కాకతీయ రాజులు ఈ బావిని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. మొత్తం మూడు అంతస్తుల్లో ఈ బావి నిర్మాణం చేపట్టారు.కింద నుంచి మొదటి అంతస్తులో స్నానం చేయడం రెండవ అంతస్తులో దుస్తులు మార్చుకోవడానికి గదులు కూడా నిర్మించారు. మూడవ అంతస్తులో పూజలు చేసుకునేలా నిర్మించుకున్నారు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారా? ఈ గుడ్ న్యూస్ మీకోసమే
అయితే ఖిలా వరంగల్ నుంచి ఈ మెట్ల బావికి సొరంగా మార్గం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ బావి నిర్మాణం ఏడాదిన్నర కాలంలోనే నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. అయితే ఆ రాణి రుద్రమదేవి ఖిలా వరంగల్ కోట నుంచి సొరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించేదని చరిత్రకారులు చెబుతారు.
ఈ మెట్ల బావి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ గోడలపై ఉన్న శిల్పకళా శైలి నాట్య భంగిమలు అందర్నీ ఆకట్టుకుంటాయి.ఈ బావిలో ఎప్పుడు నీరు నిండుగా ఉంటుంది. ఈ బావిని నిర్మించి వందేళ్లు గడుస్తున్న ఇంతవరకు చెక్కుచెదరకుండా ఉండడం ఇది ఒక గొప్ప విశేషం.
ఒరిజినల్ తేనె కావాలా? వీళ్లు స్పాట్‌లోనే చెట్టు నుంచి తీసి ఇస్తారు
ఆ రాణి రుద్రమదేవి సొరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి స్నానమాచరించిన అనంతరం బావి లోపల ఉన్న ఆ మైసమ్మ తల్లిని దర్శించుకుని వెళ్లేదని ఇక్కడ ఉండే స్థానికులు చెబుతున్నారు. అంతటి చరిత్ర ఉన్నటువంటి ఈ బావిలో నీరు ఎండకుండా ఎప్పుడు నిండుగానే ఉంటుందన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంతంలో నీరు లేకపోవడంతో ఈ బావికి మోటర్లు పెట్టి మరి ఈ నీటిని వినియోగించుకున్నట్లు చెప్పారు.
వందల ఏళ్లనాటి చరిత్ర ఉన్నటువంటి ఈ మెట్ల బావిని సందర్శించేందుకు నిత్యం ఎంతో మంది వస్తుంటారని చెప్పారు. విదేశాల నుంచి వచ్చి కూడా కొంతమంది ఈ బావిని సందర్శిస్తూ ఉంటారని తెలియజేశారు. ఇంతటి రహస్యం ఉన్నటువంటి ఈ బావిని ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు ఆశిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..