Viral Video: టెక్నాలజీ డెవలప్‌మెంట్‌తో ప్రపంచం మొత్తం చాలా అడ్వాన్స్‌డ్‌గా మారిపోతోంది. ముఖ్యంగా రెస్టారెంట్లు డిజిటల్ సర్వీస్‌లను త్వరగా ఇంప్లిమెంట్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. వివిధ రెస్టారెంట్లు రోజువారీ పనుల కోసం రోబోలను ఉపయోగిస్తున్నాయి. ఫుడ్ సర్వ్ చేయడం నుంచి వెల్కమ్ చెప్పడం వరకు.. రోబోలు ఎన్నో సేవలు అందిస్తున్నాయి. దీనివల్ల ఫుడ్ సర్వీస్ ఇండస్ట్రీలో రోబోల వాడకం వేగంగా పెరుగుతోంది. తాజాగా చైనాలోని ఒక రెస్టారెంట్‌లో హ్యూమనాయిడ్ రోబో (Robot) వెయిట్రెస్‌గా (Waitress) పని చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియో చూసిన ప్రజలు రెస్టారెంట్‌లోని ఫిమేల్ రోబోని చూసి ఆశ్చర్యపోయారు. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. వీడియో చూసిన నెటిజన్లు రోబో కదలికలు చూసి ఫిదా అయ్యారు. అయితే తర్వాత ఆ వెయిట్రెస్ నిజమైన రోబో కాదని, ప్రాణం ఉన్న ఓ మహిళ అని తెలిసింది.
మనిషే రోబోగా..
వైరల్ అయిన ఈ వీడియోలో, ఒక హ్యూమనాయిడ్ రోబో వేషంలో ఉన్న మహిళ కస్టమర్లకు ఆర్డర్లను అందిస్తున్నట్లు కనిపిస్తుంది. చాలా మంది ఆ వెయిట్రెస్‌ను నిజమైన రోబో అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఒక మహిళ రోబోలా నటించిందని తెలిసింది. తన నటన పర్ఫెక్ట్‌గా ఉండటంతో కస్టమర్లు కూడా ఆమె నిజమైన మనిషి అని నమ్మలేకపోయారు. ఈ మహిళ రోబోలా నడవడం, మాట్లాడటం నేర్చుకుంది. ఈ టాలెంట్‌తో ఆమె రెస్టారెంట్‌కు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది.
క్యాప్షన్ ట్విస్ట్ రివీల్డ్
“@asian_technology” అనే పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. వీడియో క్యాప్షన్‌లో “మేం రూపొందించిన అద్భుతమైన AI రోబో వెయిట్రెస్‌ను చూడండి! ఎంతో కచ్చితత్వం, వేగంతో ఆహారాన్ని అందిస్తోంది! దాని స్మూత్ మెకానికల్-మూవ్‌మెంట్స్, కచ్చితమైన టైమింగ్ చూస్తే అది సైన్స్ ఫిక్షన్ సినిమాలోని క్యారెక్టర్‌లాగా కనిపిస్తుంది. కానీ, శ్రద్ధగా గమనిస్తే, ఈ అద్భుతమైన నటన వెనుక ఉన్న నిజమైన ప్రతిభను తెలుసుకోవచ్చు. ఇది టెక్నాలజీ, కళా నైపుణ్యం కలయిక. మానవ నైపుణ్యంతో కలిపి మేం రియల్ రోబో లాంటి ఇల్యూషన్ క్రియేట్ చేశాం.” అని రాశారు.
సారాటెండూల్కర్ ఫ్రాన్స్ వెకేషన్ ఫోటోలు వైరల్
నెటిజన్ల రియాక్షన్
ఈ వీడియో క్యాప్షన్ చదివాక చాలామంది నెటిజన్లు షాక్ అయ్యారు. కామెంట్ సెక్షన్‌లో రెస్టారెంట్ చేసిన ఈ వినూత్నమైన ఆలోచనను మెచ్చుకున్నారు. ఓ యూజర్ “అబ్బా! ఆమె చాలా బాగుంది” అని రాశారు. మరొకరు “ఇది నిజమైన వ్యక్తి అని నేను ఇప్పటికీ పూర్తిగా నమ్మలేకపోతున్నా.” అని వ్యాఖ్యానించారు. రెస్టారెంట్లు కస్టమర్లను ఆకట్టుకోవడానికి చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నాయి అని ఇంకొందరు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..