తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జన్మదినం సందర్భంగా
రాష్ట్ర రవాణా శాఖ సభ్యులు సునీల్ చక్రవర్తి మర్యాదపూర్వంగా
కలిసి శాలువా బొకేలతో సన్మానించారు, ఈ సందర్భంగా
మీడియా తో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా
తిరుపతి నియోజకవర్గం అభివృద్ధి పదం లో నడుస్తుంది అంటే
దానికి ఏకైక కారణం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అని
హర్షం వ్యక్తం చేశారు. తండ్రికి తగ్గ తనయుడు ఆరని మదన్ తిరుపతి నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంలా భావించి అహర్నిశలు శ్రమిస్తున్నారు, తిరుపతి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు, ఈ సందర్భంగా మదన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రమేష్, నాగరాజు, పవన్, లోకేష్ రాయల్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
