న్యాయదేవత గుడ్డిది కాదు


హైదరాబాద్:అక్టోబర్ 17 సుప్రీంకోర్టులో న్యాయ దేవత కొత్త విగ్రహంలో కొన్ని మార్పులు చేశారు. న్యాయదేవతకు ఉన్న కళ్ల గంతలు తొలగించి, చేతిలోని కత్తి స్థానంలో రాజ్యాంగ పుస్తకాన్ని ఇచ్చారు.భారతీయ న్యాయవ్యవస్థ లోనే చారిత్రక ఘట్టం. న్యాయవ్యవస్థ చిహ్నం పూర్తిగా మారిపోయింది. లేడీ ఆఫ్ జస్టిస్ కళ్లకు గంతలు కట్టడం పెద్ద విష యం. దీని గురించి చాలా మంది చట్టానికి కళ్లులే వని..అసలు న్యాయదేవత కళ్లకు గంతలు ఎందుకు కట్టారన్న సందేహాలు ఎన్నో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ఆదేశించిన కొత్త న్యాయదేవత విగ్రహం పూర్తి భిన్నంగా ఉంది. కొత్త విగ్రహానికి చట్టానికి కళ్లులే వనే నానుడి మార్చేందుకు న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు లేవు. కళ్లపై కట్టిన నల్లని వస్త్రం కనిపించదు. నిజానికి పాత విగ్రహంలో చూపబడిన గుడ్డి చట్టం నేటి తరానికి సరైనది కాదు న్యాయవ్యవస్థ ముందు అందరూ సమాన మేనని కళ్లకు గంతలు కట్టుకున్న మహిళా విగ్రహం ప్రజలకు తెలుపుతోంది. కానీ కొత్త న్యాయదేవత విగ్రహంలో మాత్రం చట్టం గుడ్డిది కాదు సమానత్వ సందేశాన్ని ఇస్తుంది. కానీ చట్టం కళ్లు తెరిచింది. కత్తికి బదులుగా రాజ్యాంగ పుస్తకం ఉండటం చూస్తుం టే చట్టం సాధనం రాజ్యాం గం అని చెబుతోంది. అలాగే అంతకుముందు కళ్లకు గంతలు కట్టుకున్న విగ్రహం కొంతమేరకు వలసపాలన కు మూలం.కొత్త విగ్రహం భారతీయ మహిళ వలే ఉంది. ఒక రకంగా చూస్తుంటే ఇది న్యాయదేవతలా కనిపిస్తుంది. ఇక నుంచి న్యాయవ్యవస్థలో ధర్మ దేవత, న్యాయదేవత అన్యాయాన్ని సహించదని చెప్పడానికే ఈ తరహా చిహ్నాన్ని మార్చినట్లు తెలుస్తోంది.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements