ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష


సచివాలయంలో ఇండస్ట్రియల్ డవల్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

నూతన పాలసీతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు సిఎం చంద్రబాబు ప్రయత్నాలు

సమగ్ర మార్పులతో 7-8 శాఖల్లో నూతన పాలసీలకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం

మూడు నెలలుగా కొత్త పాలసీలపై సమగ్ర కసరత్తు చేసిన అధికారులు

ముఖ్యమంత్రి సూచనలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఉత్తమ ఫలితాలు ఇచ్చిన ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా వివిధ డ్రాఫ్ట్ పాలసీలు రూపొందించిన అధికారులు

ఎంప్లాయిమెంట్ ఫస్ట్ ( ఉద్యోగ కల్పన ప్రధమ లక్ష్యం) అనేదే ప్రభుత్వ విధానమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడుదారులను ఆకర్షించి…. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుగమం చేసేలా నూతన పాలసీలు

ప్రతి పాలసీ తయారీలో తన అనుభవాలు, ఆలోచనలు పంచుకున్న ముఖ్యమంత్రి…ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలన్న చంద్రబాబు

పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడులు పెట్టే విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా నిలవాలన్న సీఎం

వచ్చే క్యాబినెట్ ముందుకు ఇండస్ట్రియల్ డవల్మెంట్ నూతన పాలసీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలు తెచ్చేందుకు నిర్ణయం

పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం

కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్ మెంట్, డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇచ్చిన మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా డ్రాఫ్ట్ పాలసీలో ప్రతిపాదనలు

ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అడిషనల్ గా 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ

దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో ఆలోచనలు చేస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేసిన సిఎం చంద్రబాబు

తద్వారా ఆయా సంస్థలకు జాప్యం లేకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా ఇన్సెన్టివ్ లు దక్కుతాయని…ఇది పారిశ్రామిక ప్రగతికి, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందన్న సిఎం

త్వరిత గతిన ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ఇలాంటి కీలక నిర్ణయాలు దోహదం చేస్తాయన్న సిఎం

ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను, విధివిధానాలను సమగ్రంగా స్టడీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం

ఒక కుటుంబం…ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్ తో ఎంఎస్ ఎంఈ పాలసీ ఉండాలన్న సిఎం చంద్రబాబు

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రత్యేక హబ్ తీసుకురావాలని నిర్ణయం

స్కిల్స్ డవల్మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో హబ్ కు అనుంబంధంగా సెంటర్స్ ఏర్పాటు

ఒక్కో సెంటర్ కు ఒక్కో మల్టీనేషనల్ కంపెనీ మెంటార్ గా ఉండేలా ప్రతిపాదనలు

ఆక్వా, ఫౌల్ట్రీ రంగంలో వచ్చిన విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ లో ఫలితాలు వచ్చే విధానాలపై చర్చ

ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెన్టివ్ వచ్చేలా ప్రతిపాదనలు

ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీపైనా చర్చ…మరింత కసరత్తు తరువాత క్యాబినెట్ ముందుకు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ

సమీక్షకు హాజరైన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, అధికారులు

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements