చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం
*ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేపట్టిన మధ్యప్రదేశ్ వ్యవసాయ అధికారులు.*
చిత్తూరు జిల్లాలో మధ్యప్రదేశ్ కు చెందిన 10 మంది వ్యవసాయ పరిశీలకులు బృందం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతులు, వివిధ రకాల పంట పొలాలను మధ్యప్రదేశ్ బృందం పరిశీలించారు. అందులో భాగంగా వెదురుకుప్పం మండలంలోని తెల్లగుండ్లపల్లి గ్రామం,హనుమంతు రెడ్డి పొలంలో బీజామృతం,ఘన,ద్రవ జీవామృతం ,ఘన జీవామృతం లో రెండవ పద్ధతి,నీమాస్త్రం,కోడి గుడ్డు నిమ్మరసం ద్రావణం,పుల్లటి మజ్జిగ మొదలైన కాషాయాల,ద్రావణాలు తయాలు చేసి చూపించడం జరిగింది. కూరగాయలు ATM మోడల్ లో 18 రకాల మొక్కలు మరియు కూరగాయల మోడల్ విధానాన్ని పరిశీలించి వాటి ఉపయోగాలు రైతు హనుమంతును అడిగి పొలంలో పాటిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకున్నారు.వేరుశెనగ A గ్రేడ్, మామిడిలో పీఎండీఎస్,సూర్యమండలం మోడల్,డ్రాట్ ప్రూఫింగ్ చిత్తూరు మోడల్ ఉపయోగాలు గురించి తెలియజేయడం జరిగింది. వీటికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఘన, ద్రవ జీవామృతాలు కాషాయాలు ద్రావణాలు ఉపయోగించి పూర్తిగా సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పండిస్తున్నామనీ రైతు హనుమంతు తెలియజేశారు. ఇందులో భూమిని మరియు సూర్య రస్మిని సమర్థవంతంగా వినియోగించుకోవడం జరుగుతున్నదని, రసాయన వ్యవసాయ పద్ధతులలో 5 ఎకరాలలో పండించే పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో 1 ఎకరలోనే పండించి అధిక ఆదాయం పొందుతున్నానని, వరి పంటలలో దేశీ రకాలైన నవారా,మైసూరు మల్లిగా, దూదేశ్వర్ లాంటి వరి పంటలను కూడా పందించామని తెలియజేశారు.వీరి పొలం అంతా బాగా ఉందని ఈ పద్ధతులు బాగా ఉన్నాయని, దేశీయవాలీ పుంగనూరు ఆవులు,దూడను చూసి చాలా ఆనందం వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో, రాష్ట్ర RySS NRO తీమాటిక్ లీడ్ హుమయూన్ గారు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వాసు గారు, గురుప్రసాద్ NFA గారు,వ్యవసాయ పరిశోధకురాలు పుష్ప గారు, రాష్ట్ర స్థాయి అధికారి కల్పన గారు,NFA ట్రైనర్ నాంచారమ్మ గారు,ఇండియన్ బ్యాంక్ దేవలం పేట బ్రాంచ్ మేనేజర్ నాగరాజు మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.