బీజేవైఎం ఆధ్వర్యంలో గూడూరులో ఘనంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం


*బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వాలు నమోదు కార్యక్రమం*
*బిజెపి సభ్యత్వాలు విజయవంతం చేయండి : బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్*
భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు మిట్ట వంశీ గారి ఆదేశాల మేరకు మరియు బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప గారు, బీజేవైఎం తిరుపతి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచనల మేరకు స్థానిక గూడూరు రెండో పట్టణ పరిధిలో సభ్యత్వాల నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు గూడూరు పట్టణంలో యువత చేత బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ముందుకెళుతూ భారతదేశని విశ్వ గురువుగా చేయాలనే తపిస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భంగా పార్టీ బలోపేతం కోసం అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లే భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు మరియు బీజేవైఎం నగర అధ్యక్షులు శివ శంకర్ మాట్లాడుతూ ప్రతి బూతు కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని యువత కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా బిజెపి సభ్యత్వంలో నమోదు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర ఉపాధ్యక్షులు ప్రణయ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కార్తీక్ మరియు బీజేవైఎం నాయకులు కిరణ్ మహేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements