మంకీపాక్స్ వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ కట్టడికి WHO తొలి వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బవేరియన్ నార్డిక్ సంస్థ తయారుచేసిన MVA-BN వ్యాక్సిన్ ను వాడొచ్చని తెలిపింది.
అటు ఆఫ్రికాలో ఈ వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది.
గతవారం మంకీపాక్స్ తో 107 మంది మరణించగా 3,160 కొత్త కేసులు నమోదైనట్లు ఆఫ్రికా వ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది.
వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్
ఎంతో దోహదపడుతుందని తెలిపింది.