కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయిన ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్


*న్యూఢిల్లీ/అమరావతి*

*కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సుమారు 20 నిముషాలు భేటీ అయిన ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర అధికారులు*

విజయవాడ సహా… రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరదల వల్ల సంభవించిన నష్టం పై కేంద్ర మంత్రికి వివరాలు అందించిన కేశవ్

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక నివేదిక కాపీని నిర్మలా సీతారామన్ కి అందించిన కేశవ్.

కేంద్ర మంత్రి తో భేటీకి ముందు… కేశవ్, రాష్ట్ర అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు

నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్ళాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేసిన చంద్రబాబు

ప్రస్తుతం సంభవించిన వరదలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ప్రభావం చూపినట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన కేశవ్.

పట్టణ ప్రాంతాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని, చిన్న మధ్యతరగతి ప్రజానీకం పై తీవ్ర ప్రభావం చూపినట్లు నిర్మలా సీతారామన్ కి వివరించిన కేశవ్.

చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వృత్తి పరమైన వ్యాపారులు దెబ్బతిన్నాయని చెప్పిన కేశవ్.

సీఎం ఈ రోజు రాష్ట్రంలోని బ్యాంకర్లతో భేటీ అయ్యారని, వరదల ప్రాంతాల్లో రుణాల చెల్లింపులు, వారికి చేయూత ఇచ్చేందుకు సహకారాన్ని ఇవ్వాలని కోరినట్లు చెప్పిన కేశవ్

ఆంధ్రప్రదేశ్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల చెల్లింపులు వాయిదా వేయాలని, వడ్డీలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సీఎం తరపున కోరిన కేశవ్

ఇలాంటి వారిని ఆదుకోవడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదో చంద్రబాబు చెప్పిన విషయాలను నిర్మలా సీతారామన్ కు వివరించిన కేశవ్

చంద్రబాబు చెప్పిన విషయాలు, రాష్ట్ర ప్రభుత్వ నివేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించిన రాష్ట్ర మంత్రి

తుది నివేదిక కూడా త్వరగా ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలని కేశవ్ కు చెప్పిన నిర్మలా సీతారామన్

ప్రస్తుతం ఒక కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోందని, అవసరాన్ని బట్టి మరో బృందం కూడా రాష్ట్రానికి వస్తుందని కేశవ్ కి చెప్పిన నిర్మలా సీతారామన్.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements