రూ.30 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్న యూఎస్ ఓపెన్ 2024 విజేత అరినా సబలెంక
రూ.30 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్న యూఎస్ ఓపెన్ 2024 విజేత అరినా సబలెంక
యూఎస్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అరినా సబలెంక విజేతగా నిలిచింది. ఈ పోరులో సబలెంక 7-5, 7-5 తేడాతో ప్రపంచ 6వ ర్యాంకర్ జెస్సికా పెగులాను ఓడించి తన కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకుంది. ఈ విజయంతో ఆమె $3,600,000 (రూ.30 కోట్ల కంటే ఎక్కువ) ప్రైజ్ మనీ అందుకుంది. ఏంజెలిక్ కెర్బర్ (2016) తర్వాత ఏడాది వ్యవధిలో 2 హార్డ్ కోర్ట్ గ్రాండ్‌స్లామ్ లు సాధించిన తొలి మహిళగా సబలెంక నిలిచింది.