*చైనాను వెనక్కి నెట్టి.. రెండోస్థానానికి భారత్*
ప్రస్తుతం డిజిటల్ కాలం నడుస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. అయితే.. టెలికాం రంగాలు కూడా అదేస్థాయిలో స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ అరుదైన రికార్డును అందుకుంది. చైనాను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. భారత్ తొలిసారిగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మొబైల్ మార్కెట్‌గా అవతరించింది. గ్లోబల్‌గా 5జీ మొబైళ్ల వాడకంలో గతేడాదితో పోలిస్తే 2024 మొదటి అర్థభాగంలో 20 శాతం పెరిగిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. 5జీ ఫోన్లలో యాపిల్ మొబైల్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారని నివేదిక వెల్లడించింది.
100జీబీ ఫ్రీ స్టోరేజీ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా 5జీ మొబైళ్లు వాడుతున్న దేశాల్లో అమెరికా తర్వాత భారతదేశం రెండో స్థానంలో ఉంది. అయితే.. రెండోస్థానంలో ఇప్పటి వరకు చైనా ఉండేది. తాజాగా భారత్.. చైనాను వెనక్కి నెట్టినట్లు నివేదిక వెల్లడించింది. దాంతో ఒక స్థానం ముందుకు జరిగి.. రెండో ప్లేస్‌లో నిలిచింది. ఇక 5జీ నెట్‌వర్క్‌లో ఎక్కువగా యాపిల్ ఫోన్లను వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కేటగిరీలో 25 శాతం కంటే ఎక్కువ వాటా యాపిల్ సొంతం చేసుకుంది. ఐఫోన్ 15, 14 సిరీస్‌ల్లో ఈ సాంకేతికతను ఎక్కువగా వాడుతున్నారు. మరోవైపు బడ్జెట్ విభాగంలో ఎక్కువగా షావోమీ, వివో, శామ్‌సంగ్ ఇతర బ్రాండ్‌లకు చెందిన మొబైళ్లను వాడుతున్నారు. 5జీ వాడుతున్నవారిలో 21 శాతం మంది శామ్‌సంగ్ గెలాక్సీ ఏ సిరీస్, ఎస్24 సిరీస్‌లను ఉపయోగిస్తునారు. 4జీ కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్ పనిచేస్తుంది. 4జీలో ఒక సినిమా డౌన్‌లోడ్ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే ఇందులో రెప్పపాటులోనే అల్ట్రా హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.