నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్… భారీగా తగ్గిన చికెన్ ధరలు


*నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన చికెన్ ధరలు.. ఎంతో తెలుసా.*

నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గత కొన్ని నెలలుగా కొండెక్కిన చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. జులై నెలలో కిలో చికెన్ ధర రూ.280 నుంచి రూ.300 వరకు పలికిన విషయం విదితమే.
దీంతో చికెన్ ధరలు చూసి సామాన్యుడు షాక్ అయ్యాడు. ఇక, శుభకార్యాలు, ఫంక్షన్లకు కూడా అత్యవసరమయితే తప్ప చికెన్‌ కొనలేని పరిస్థితి దాపురించింది. ఇక, ఆగస్టు నెల నుంచి మొదటి నుంచే చికెన్ ధరలు తగ్గుముఖం పడుతుండడం చూస్తున్నాం.. దానికి కారణం లేకపోలేదు.

ఈ సంవత్సరం మొదటి నుంచే చికెన్ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కానీ ఈ నెల (ఆగస్టు) మొదటి వారం నుంచి చికెన్‌ ధరలు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నారు. శ్రావణ మాసం కావడంతో ఈ నెలంతా పూజలు, వ్రతాలు ఇతర శుభకార్యక్రమాలతో మహిళలు ఫుల్‌బిజిగా గడిపేస్తారు. ఈ సమాయాల్లో ఇంట్లోకి నాన్‌వేజ్ రానివ్వరూ మహిళలు. చాలామంది నాన్‌వెజ్ ముట్టుకోరు. ఈ నెలంతా శాఖహారానికే ప్రాధాన్యత ఇస్తారు. దీంతో చికెన్‌ వినియోగం తగ్గి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

మరోవైపు పూజలు, వ్రతాలు చేయని వారు మాత్రం ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని చికెన్‌ను ఓ పట్టు పడుతున్నారు. ఈ నెల 5వ తేదిన కిలో చికెన్ ధర రూ.180 పలుకగా, 11వ తేదీ ఆదివారం నాటికి చికెన్ ధర రూ.150కి చేరింది. ఇక, ఆగస్టు 17వ తేదీ నిన్నటికి (శనివారం) కిలో చికెన్ ధర రూ.158గా ఉంది. శ్రావణమాసం సీజన్ కారణంగా ఆదివారాలతో సహా వారంలో అన్ని రోజుల్లో దాదాపు ఇవే రేట్లు ఉండనున్నాయి. వాస్తవానికి వీకెండ్‌లో నాన్‌వెజ్ తింటారు. కాబట్టి ఆదివారాల్లో చికెన్ ధరలు పెరగాలి. కానీ, పూజలు వ్రతాలు ఉండడం వల్ల ఈ ఆదివారం చికెన్ ధరలు తగ్గే ఉన్నాయి. ఎటువంటి పూజలు, వ్రతాలు చేయని వారికి మాత్రం ఇది పండగే అని చెప్పుకోవచ్చు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements