*వైద్యురాలిపై హత్యాచారం.. నిందితునికి ‘లై డిటెక్షన్ టెస్ట్*..
కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ విచారణలో రోజుకో మాట చెబుతున్నాడు. దీంతో అతనికి లై డిటెక్షన్ టెస్ట్ (పాలీగ్రాఫ్) నిర్వహించేందుకు అధికారులు కోర్టు అనుమతి కోరనున్నారు. అలాగే సైకో అనాలసిస్, లేయర్డ్ వాయిస్ అనాలసిస్ టెస్టులు చేసేందుకు CFSL నిపుణులు కోల్కతాకు చేరుకున్నారు. ఈ పరీక్షల వల్ల నిందితుడి మానసిక స్థితిని, అతను చెప్పే మాటల్లో అబద్ధాలను తెలుసుకోవచ్చు.