మిర్చి రైతులు ఇలా చేయండి.. ఎకరాకు రూ.70 వేలు పొందండి..

ప్రస్తుత ఆధునిక కాలంలో వరి కన్నా, పత్తి కన్నా మిర్చి కి అధిక దిగుబడి వస్తుంది అని రైతులు చెబుతున్నారు. మిర్చికి వాటికన్నా అధిక పెట్టుబడి అదే విధంగా కష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. మిర్చిని సరైన పద్ధతిలో పండియ్యాలే కానీ మిర్చికి ఒక ఎకరానికి పెట్టుబడి పోను దాదాపు 70 వేల రూపాయలు మిగులుతున్నాయి. అదే విధంగా పంట మార్పిడి చేయడం వల్ల కూడా పంటలు రోగాల బారిన పడకుండా ఉంటుందని రైతులంటున్నారు.

వివరాల్లోకెళ్తే.. ఒక యువ రైతు పత్తి , వరి, మిరప సాగు చేస్తున్నాడు. మూడు పంటలు మూడు ఎకరాల్లో ఎకరం చొప్పున మూడు రకాలుగా పండించడం జరిగింది. అందులో మిరప పంట అధిక దిగుబడి ఇచ్చింది. పత్తి… వరి కన్నా ఒక ఎకరానికి దాదాపు 70 వేల రూపాయలు లాభం వచ్చింది. మిర్చి విత్తనాలు నల్గొండ జిల్లాలో ఫర్టిలైజర్ దుకాణంలో కొనుగోలు చేయడం జరిగిందని రైతు లోకల్ 18తో తెలిపారు.

నారు వచ్చేసి నర్సరీలో సాదడం జరిగిందన్నారు. మిర్చి నాటు పెట్టిన నుండి ప్రతి రెండు రోజులకు ఒక సారి నీరు కట్టడం జరిగిందన్నారు. ఏదైనా రోగం వస్తే స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి చెట్టు చూపిస్తే పలాన రోగం అని నిర్ధారించి ఫలానా మందు కొట్టామని చెప్పేవారు. వరికి, మిర్చి అంత పని ఉండదు. అదే వరి అయితే పెట్టుబడి పోను 15 వేల కంటే ఎక్కువగా మిగలవు.

పత్తికి కూడా మిర్చి లాగానే చేసే విధానం ఒకటే ఉంటుంది. కాకపోతే మిర్చి అంత దిగుబడి లాభం ఉండదు. పత్తికి ఒక ఎకరానికి ఖర్చులు పోను 20,000 రూపాయలు మిగులుతున్నాయి. పంట మార్పిడి చేస్తే కూడా పంట రోగాల బడిన పడకుండా అధిక దిగుబడి వస్తుంది. తాను పండించిన ఈ మూడు పంటల్లో మిర్చి అధిక దిగుబడి వచ్చిందన్నారు. దాని నుండి అధిక లాభం కూడా పొందానని చెప్పారు. రైతులకు తను ఇచ్చే సలహా ఏందంటే మిర్చికి పెట్టుబడి ఎక్కువ పెట్టాలి అదే విధంగా కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. కొంచెం ఓపిక తోటి చేసుకుంటే మిర్చి ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు అని లోకల్ 18 ద్వారా తెలియజేశారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements