Viral Video: ముసలోడికి దసరా పండగ అంటే ఇదేనేమో.. వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి

Viral Video: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. కొన్ని జంటలను చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. వధువరులు ఇద్దరూ అందం, ఈడు,జోడు బాగుంటే అతిథులు కూడా ఇదే మాట అంటారు. అయితే ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అవుతోంది. అది చూసిన తర్వాత వారు వధూవరులని నమ్మడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఆ జంట పెళ్లి వేడుకల్లో వధువు, వరుడు డ్యాన్స్ చేస్తుంటే ..నిజానికి తాత, మనవరాలు డ్యాన్స్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.

పెళ్లి అంటే వధు,వరుల వయసులో తేడా కామన్..

సాధారణంగా వివాహంలో వధూవరుల వయస్సు కాస్తో, కూస్తో తేడాగా ఉంటుంది. లేదా సమానంగా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది. అమ్మాయిల టేస్ట్ మరీ దారుణంగా ఉంటోంది అనడానికి ఈ వీడియో ఉదాహరణ. తమ తాత వయస్సులో ఉన్న వాళ్లను జీవిత భాగస్వాములుగా చేసుకుంటున్నారు. సాధారణంగా విదేశాల్లో ఇలాంటి పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి. కాని ప్రస్తుతం మన దేశంలో కూడా ఇలాంటి కేసులు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ జంటే పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చింది.

70 ఏళ్ల వరుడు, 28 ఏళ్ల వధువు!

వైరల్ అవుతున్న వీడియోలో గ్రాండ్ గా వెడ్డింగ్ జరుగుతున్నట్లు చూడవచ్చు. ఇందులో రెడ్ కలర్ సన్‌డ్రెస్‌తో అందమైన వధువు కనిపిస్తుంది. తాత వయసులో ఉన్న ఒక వ్యక్తి క్రీమ్ కలర్ షేర్వానీ, ఎరుపు రంగు దుపట్టాలో ఆమె పక్కన కనిపిస్తున్నాడు. వారి రొమాంటిక్ డ్యాన్స్‌ను బట్టి చూస్తే కచ్చితంగా వాళ్లిద్దరూ జంట అని మీరు అర్థం చేసుకోగలరు. ఈ పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగినా ఇటాలియన్ జంటను మాత్రం జనాలను భార్యభర్తలుగా స్వీకరించలేకపోతున్నారు.

కామెంట్స్ వైరల్..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది ఓ యాంకర్. anchorkhushboonandwaniఅనే అకౌంట్‌లో ఈ వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియోను ఒక్కరోజులోనే 6 లక్షల మందికి పైగా చూడగా 10 వేల మంది లైక్ చేశారు. దీనిపై ఆసక్తికర కామెంట్స్ కూడా వచ్చాయి. అమ్మాయి చాలా తెలివైనది సోదరా! అని ఒకరు కామెంట్ పెడితే మరొక నెటిజన్ టెక్నికల్‌గా బాగా రిచ్ అంటూ పోస్ట్ పెట్టాడు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements

You May Like This