Puzzle: గజిబిజిగా ఉన్న ఈ ఇంట్లో ఒక బేస్‌బాల్ బ్యాట్‌ ఉంది.. దాన్ని కనిపెడితే మీది సూపర్ మైండ్

Puzzle: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ వైరల్ అవుతున్నాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical illusions) ఒక రకం. ఇవి మన మెదడును సవాలు చేసే చిత్రాలు. ఈ ఇమేజ్‌లు మనం చూసే దానికి భిన్నంగా కనిపిస్తాయి, వాటిని అర్థం చేసుకోవడానికి బుర్రను బాగా ఉపయోగించాల్సి ఉంటుంది. వీటిని సాల్వ్ చేస్తుంటే బ్రెయిన్ పవర్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా చాలా ఫన్ లభిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్ వైరల్‌గా మారింది. దాన్ని మీరు సాల్వ్ చేయగలరేమో చూడండి.

ఈ పజిల్ ఇమేజ్‌ చూడండి. ఇందులో గజిబిజిగా ఉన్న ఒక ఇంటి సెట్టింగ్‌లో కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్‌ కనిపిస్తున్నాయి. బట్టలు, బొమ్మలు, బుక్స్‌, డైనింగ్ టేబుల్, ప్లేట్లు, ఇతర వంట సామాగ్రి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక బేస్‌బాల్ బ్యాట్‌ (Baseball bat) కూడా ఉంది. కానీ అది అంత సింపుల్‌గా కనిపించదు. 8 సెకన్లలో ఆ బ్యాట్‌ను కనిపెట్టడమే పజిల్ టాస్క్. కేవలం 1% మంది మాత్రమే దీన్ని సాల్వ్ చేయగలరు. అంత డిఫకల్ట్‌గా ఉంటుందీ పజిల్. మరి ఈ సవాలుకు సిద్ధంగా ఉన్నారా? అయితే టైమర్ స్టార్ట్ చేసి చిత్రాన్ని చాలా దగ్గరగా పరిశీలించడం ప్రారంభించాలి.

News18

ఈ పజిల్‌ను సాల్వ్ చేయాలంటే ఎక్స్‌లెంట్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలి. బ్యాట్ బ్యాక్‌గ్రౌండ్‌లో బాగా కలిసిపోయింది, అది ఎక్కడుందో కనిపెట్టే తెలివి కూడా ఉండాలి. లాజికల్‌గా, క్రియేటివ్‌గా థింక్ చేయాలి. ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ను ఇచ్చిన సమయంలోగా సాల్వ్ చేసిన వారికి అద్భుతమైన IQ, పరిశీలనా నైపుణ్యాలు ఉన్నాయని అర్థం! సాల్వ్ చేసిన వారు హై అబ్జర్వేషన్స్ స్కిల్స్ ఉన్న కేవలం ఒక్క శాతం మంది కేటగిరీలోకి కూడా వస్తారు. చురుకైన దృష్టి, వేగంగా ఆలోచించగల సామర్థ్యం అధిక తెలివితేటలకు గుర్తులు.

దీన్ని సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయితే మరోసారి చిత్రాన్ని శ్రద్ధగా పరిశీలించాలి. బేస్‌బాల్ బ్యాట్‌ను త్వరగా గుర్తించగలిగితే, అధిక తెలివితేటలు, పర్సెప్షన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ఒకవేళ అసలే కనిపెట్టలేక పోతే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కింద సొల్యూషన్ పిక్చర్ కూడా ఇస్తున్నాం.

News18

సొల్యూషన్ పిక్చర్

బేస్‌బాల్ బ్యాట్‌ను రెడ్ కలర్‌ యారోతో గుర్తించాం. ఈ బ్యాట్‌ కుడి వైపు పై భాగంలో ఒక పెయింటింగ్ పక్కన ఉంది. ఈ పజిల్‌ను ఎంజాయ్ చేసి ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేసి సవాల్ విసరవచ్చు. ఇలాంటి మరెన్నో డిఫికల్ట్ పజిల్స్ సాల్వ్ చేయాలనుకుంటే న్యూస్18 తెలుగు వెబ్‌సైట్ విజిట్ చేయవచ్చు. వీటిని ఎంత ఎక్కువగా సాల్వ్ చేస్తే అంత ఎక్కువగా మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయని గమనించాలి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements