Puzzle: ఒక బామ్మ కిచెన్‌లో కళ్లద్దాలు పెట్టి మర్చిపోయింది.. అవి ఎక్కడ ఉన్నాయో వెతికి ఇస్తారా?

Puzzle: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వివిధ రకాల బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ వైరల్ అవుతున్నాయి. వీటిలో సీక్ అండ్ ఫైండ్ పజిల్స్ (Seek and find puzzles) బాగా పాపులర్ అయ్యాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ ఒక చిత్రంలో దాగిన వస్తువును నిర్దిష్ట టైమ్ లిమిట్‌లో కనిపెట్టమని సవాలు విసురుతాయి. ఇవి ఏకాగ్రత, శ్రద్ధ, కంటిచూపును ఇంప్రూవ్ చేస్తాయి. ఈ పజిల్స్ పిల్లలు, పెద్దలకు కూడా చాలా కాలక్షేపం అందిస్తాయి. శ్రద్ధ, దృష్టి పెట్టగల సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి. డిఫరెంట్‌గా థింక్ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. అబ్జర్వేషన్ స్కిల్‌ను బాగా పెంచేస్తాయి. ఇలాంటి బెనిఫిట్స్ అందించే ఒక డిఫికల్ట్‌ సీక్ అండ్ ఫైండ్ పజిల్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ పజిల్ ఇమేజ్‌ను చూడండి. ఇందులో ఒక టేబుల్ కనిపిస్తుంది. దానిపైన గుమ్మడికాయ క్యాబేజీ టమాటా, క్యారెట్లు, అరటి పండ్లు, బీట్రూట్ వంటి రకరకాల కూరగాయలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కూరగాయల మధ్యలో ఒక జత కళ్లద్దాలు కూడా ఉన్నాయి. ఈ రంగు రంగుల వెజిటేబుల్స్ మధ్యలో అది చాలా తెలివిగా దాక్కొని ఉంది. ఒక బామ్మ కిచెన్‌లో ఈ టేబుల్‌పై కళ్లద్దాలు ఎక్కడో పెట్టి మర్చిపోయింది, మళ్లీ తీసుకుందామంటే అవి ఆమెకు దొరకడం లేదు. ఆ గ్లాసెస్ కనిపెట్టడమే ఈ పజిల్ టాస్క్‌. వాటిని గుర్తించడానికి కేవలం 7 సెకన్ల సమయం మాత్రమే ఉన్నాయి.

News18

ఇమేజ్‌లో కళ్లద్దాలు ఎక్కడైనా దాగి ఉండొచ్చు కాబట్టి మొత్తం వివరాలను చాలా పరిశీలనగా చూడాలి. అద్భుతమైన అబ్జర్వేషన్స్ స్కిల్స్ ఉన్నవారు ఇచ్చిన సమయంలోనే వీటిని కనిపెట్టగలరు. మిగతా వారికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. గొప్ప నైపుణ్యాలు ఉన్నాయో లేదో చెక్ చేయాలంటే దీనిని త్వరగా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చురుకైన కంటి చూపుతో అబ్జర్వ్ చేస్తుండాలి. కళ్లద్దాలు ఎలాంటి ఆకారంలో ఉంటాయో గుర్తు తెచ్చుకుని ఈ ఇమేజ్‌ను చెక్ చేస్తూ ఉండాలి.

7 సెకన్లలోగా బామ్మ కళ్లద్దాలు కనిపెడితే కంగ్రాట్యులేషన్స్! మీకు మంచి కంటి చూపు, మెరుగైన పరిశీలన నైపుణ్యాలు, ఏకాగ్రత ఎక్కువ అని చెప్పవచ్చు. ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే టైమర్ ఆఫ్ చేసి మరోసారి ప్రశాంతంగా చూడవచ్చు. ఈ పజిల్ 100% ఎఫర్ట్స్‌తో పరిష్కరించడానికి ప్రయత్నిస్తే మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఒకవేళ కనిపెట్టలేక పోతే కింద ఇచ్చిన సొల్యూషన్ పిక్చర్ చెక్ చేయవచ్చు.

News18

సొల్యూషన్ పిక్చర్

ఇమేజ్ కుడి వైపున, క్యారెట్ల వెనుక కళ్లద్దాలు కనిపిస్తాయి. వీటిని రెడ్ కలర్ సర్కిల్ తో కూడా హైలెట్ చేశాం తద్వారా కనిపెట్టిన ఆన్సర్‌ను సరి చూసుకోవచ్చు కనిపెట్టలేని వారు ఇది ఎలా తెలివిగా దాక్కుందో చూడవచ్చు. ఈ బ్రెయిన్ టీజర్‌ను ఎంజాయ్ చేసి ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సవాలు విసరవచ్చు. ఇలాంటి మరెన్నో ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ కోసం న్యూస్‌18 తెలుగు వెబ్‌సైట్ చెక్ చేయవచ్చు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements