ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు రోజూ లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. త్వరలో ఏపీలో కూడా మెట్రో రైళ్ల ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల చాలా మంది మెట్రో రైళ్లలో ప్రయాణించగలరు. ఐతే.. మెట్రోలో ప్రయాణానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై పెద్ద చర్చే జరుగుతోంది.
ఈ వీడియో మన ఇండియాది కాదు. జపాన్ రాజధాని టోక్యోలో సబ్‌వే ప్రయాణానికి సంబంధించినది. మన ఇండియాలో జనాభా చాలా ఎక్కువ. అలాగే.. టోక్యో నగరం కూడా ఎప్పుడూ 3.7 కోట్ల మందికి పైగా జనాభాతో కిక్కిరిసి ఉంటుంది. అందువల్ల అక్కడ సబ్‌వే స్టేషన్లలోని రైళ్లలో ప్రయాణం కూడా నరకాన్ని తలపిస్తూ ఉంటుంది. కనీసం నిలబడేందుకు కూడా వీలు ఉండనంతగా రైళ్లు రద్దీగా ఉంటాయి.
టోక్యోలో సబ్‌వే పరిస్థితిని వివరిస్తూ.. ట్విట్టర్‌లోని @TheFigen_ అకౌంట్‌లో ఓ వీడియోని జూన్ 14, 2024న పోస్ట్ చేశారు. నిమిషం ఉన్న ఆ వీడియోలో.. రైలు ప్రయాణాలు ఎలా ఉంటాయో చూపించారు. అందులో జనం కిక్కిరిసిపోతుంటే.. వారిని రైల్లో కుక్కేందుకు సబ్‌వే ఉద్యోగులు బలంగా ప్రయత్నిస్తున్నారు. ఇది టోక్యో సబ్‌వేలో ఉదయం వేళ తరచూ కనిపించే దృశ్యమే అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.
ఆ వీడియోని ఇక్కడ చూడండి
An ordinary morning on the Tokyo subway.
— Figen (@TheFigen_) June 14, 2024
ఇదీ పరిస్థితి. జనాభా ఎక్కువైతే ఎలా ఉంటుందో ఈ వీడియో వివరిస్తోంది. ఇది జపాన్‌లో కామనే అని నెటిజన్లు కామెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడే కాదు.. 1960 నుంచి ఇలాగే ఉంది అని ఒకరు పాతకాలపు ఫొటోని కూడా కామెంట్స్‌లో షేర్ చేశారు.
మన హైదరాబాద్ మెట్రో కూడా ఇప్పుడు దాదాపు ఇలాగే ఉంటోంది. పీక్ అవర్స్‌లో రైళ్లు సరిపోవట్లేదు. ప్రతీ 5 నిమిషాలకు ఓ ట్రైన్ వస్తున్నా్… 2 రైళ్లకు సరిపడా జనం ఉంటున్నారు. దాంతో చాలా మంది నెక్ట్స్ ట్రైన్ కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చేసింది. రద్దీ దృష్ట్యా ఒక్కోసారి 3 నిమిషాలకు కూడా ఒక రైలు వచ్చేలా చేస్తున్నారు. అయినా రద్దీ తగ్గట్లేదు.
బంగాళదుంప తొక్కలతో మొక్కలకు ఎరువు తయారీ
హైదరాబాద్‌లో మెట్రోరైళ్లు వస్తే రోడ్లపై ట్రాఫిక్ తగ్గుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. రోడ్లపై ట్రాఫిక్ అలాగే ఉంది. ఇప్పుడు మెట్రో రైళ్లు కూడా సరిపోవట్లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..