Optical Illusion: ఈ ఇమేజ్‌లోని 10 వస్తువులను 12 సెకన్లలో కనిపెట్టగలరా? కనిపెడితే మీ ఐస్ సూపర్ షార్ప్

Optical Illusion: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్లు (Brain teasers), పజిల్స్ (Puzzles) తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical illusions) మరింత పాపులర్ అయ్యాయి. ఇవి మెదడును చురుకుగా ఉంచుతాయి. అబ్జర్వేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్‌ చేస్తాయి. అంతేకాకుండా, మనం ఎంత చురుకుగా ఆలోచిస్తామనే విషయం కూడా తెలియజేస్తాయి. వీటిని రోజూ సాల్వ్ చేస్తుంటే మైండ్ పవర్ మాత్రమే కాకుండా కంటి చూపు, ఏకాగ్రత, దృష్టి సామర్థ్యాలు కూడా మెరుగుపడతాయి. ప్రస్తుతం ఒక డిఫికల్ట్ ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ వైరల్‌గా మారింది. ఆ పజిల్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మీ టాస్క్‌ ఏంటంటే?

ఈ ఇమేజ్‌లో ఒక యువతి బాల్ డ్యాన్స్‌ (Ball dance)కు సిద్ధం కావడం చూడవచ్చు. కానీ డ్యాన్స్‌కు వెళ్లే ముందు, ఆమె కొన్ని వస్తువులను కనుగొనాలి. ఆమె మొత్తంగా 10 వస్తువుల కోసం వెతుకుతోంది. కాకపోతే అవి ఈ సెట్టింగ్‌లో తెలివిగా దాక్కొని ఉన్నాయి. ఆ దాగిన వస్తువులను కనుగొనడంలో ఆమెకు సహాయం చేయాలి. ఇదే ఈ పజిల్ టాస్క్. దీనిని పరిష్కరించడానికి కేవలం 12 సెకన్లు మాత్రమే ఇచ్చారు కాబట్టి త్వరగా ఈ ఇమేజ్‌ను పరిశీలించాలి. వస్తువులు చిన్నవిగా ఉన్నాయి. యువతి డ్రెస్‌, మిగతా ప్లేసులలో కలిసిపోయి ఉన్నాయి కాబట్టి, చాలా శ్రద్ధగా చూడాలి. ఈ ఐటమ్స్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ కూడా కావచ్చు.

News18

ఈ ఆప్టికల్ ఇల్యూజన్ కళ్లు, మెదడుకు సవాలు విసురుతుంది. ఎంత శ్రద్ధగా గమనించగలరో, సమస్యలను పరిష్కరించగలరో కూడా టెస్ట్ చేస్తుంది. 12 సెకన్లలో అన్ని వస్తువులను కనిపెట్టడం కేవలం పదునైన అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నవారికే సాధ్యమవుతుంది. చాలా మందికి ఇంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. వీటిని కనిపెట్టాలంటే ఇమేజ్‌ను జూమ్ చేసి ఆకారాలను గమనించాలి. తద్వారా ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయో తెలుసుకోగలం. డిఫరెంట్ యాంగిల్స్‌లో కూడా ఇమేజ్‌ని పరీక్షించవచ్చు.

ఇచ్చిన సమయంలోగా 10 వస్తువులు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్యులేషన్స్ మీకు అద్భుతమైన కంటి చూపు, అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయని పరిగణించవచ్చు. ఒకవేళ దీనిని సాల్వ్ చేయడంలో విఫలమైతే మరోసారి టైమర్ ఆఫ్ చేసి ప్రయత్నించవచ్చు. ఎంతసేపు ప్రయత్నించినా 10 వస్తువులను కనిపెట్టలేకపోతే కింద ఇచ్చిన సొల్యూషన్ పిక్చర్ చెక్ చేయవచ్చు.

News18

సొల్యూషన్ పిక్చర్

పైన ఇచ్చిన ఇమేజ్‌లో 10 వస్తువులను రెడ్ కలర్ సర్కిల్‌తో హైలెట్ చేశాం. ఇందులో యాపిల్, అవకాడో, ఫ్లవర్స్, గ్రేప్స్, గుమ్మడికాయ, వీల్ వంటివి ఉన్నాయి. ఈ ఇమేజ్ చెక్ చేయడం ద్వారా సమాధానాలు సరిచూసుకోవచ్చు. ఈ పజిల్‌ను ఎంజాయ్ చేసి ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సవాలు విసరవచ్చు. ఇలాంటి మరెన్నో ఆప్టికల్ పజిల్స్ సాల్వ్ చేయడానికి న్యూస్ 18 తెలుగు వెబ్‌సైట్ విజిట్ చేయవచ్చు. న్యూస్18 తెలుగు ఫేస్‌బుక్ పేజీ ఫాలో కావడం ద్వారా ఈ పజిల్స్ డైలీ పొందవచ్చు. వీటిని ఎంత ఎక్కువగా సాల్వ్ చేస్తే అంత ఎక్కువగా మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయని గమనించాలి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements