తను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయురాలి గా బోధించడం చాలా ఆనందించదగ్గ విషయం. ఇదే కోవకు చెందారు నల్లగొండకు చెందిన ముస్కు కవిత. ప్రాథమిక విద్య, అలాగే ఉన్నత విద్యా నోముల పాఠశాలలోనే 1980-81 బ్యాచ్ లో పదవ తరగతి పూర్తి చేసింది. తన స్వగ్రామంలోనే ఉపాధ్యాయురాలిగా పనిచేయటం గర్వకారణంగా ఉందన్నారు. పాఠశాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు గ్రామ ప్రముఖులకు అనుసంధానంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పాఠశాల మౌళిక సదుపాయాల కల్పనకు తన వంతుగా కృషి చేస్తున్నానని లోకల్ 18తో తెలిపారు.
ఉపాధ్యాయురాలు ముసుకు కవిత చెప్తున్న వివరాల ప్రకారం ఉన్నత చదువు కోసం నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అలాగే B.Sc., B.Ed., M.A. Osmania University లో కరెస్పాండెన్స్ ద్వారా చేశారు.1985-sep-02.“ప్రథమనియామకం రూ. 398/- నకిరేకల్ సమితి లోని శాలిగౌరరం ప్రాథమిక పాఠశాల రామగిరిలో తర్వాత మండలాలు ఏర్పడ్డాక ప్రాథమిక పాఠశాల నడిగూడెంలో తర్వాత చందుపట్లలో తర్వాత నకిరేకల్ లో 2005 లో తుంగతుర్తి మండలం, వెలుగుపల్లి ఉన్నత పాఠశాలలో బయాలజి స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందడం జరిగింది. 2009 లో ZPHS నకిరేకల్ 2018 లో ZPHS నోముల కి రావడం జరిగిందన్నారు.
Jobs: నిరుద్యోగులకు శుభవార్త..
తన స్వగ్రామంలోనే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండడము వల్ల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామ ప్రముఖులకు అనుసంధానంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పాఠశాల మౌళిక సదుపాయాల కల్పనకు తన వంతుగా కృషి చేస్తూ, తన వృత్తిని నిర్వహించడం జరుగుతుంది. దాతలను గుర్తించి, వారి సహకారంతో పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్, విద్యార్థులకు కావలసిన స్టడీ మెటీరియల్ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
అదే విధంగా పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను సమన్వయం చేస్తూ, పాఠశాల ఆడిటోరియం నిర్మాణానికి తన ప్రయత్నాలు ప్రారంభించారు. కవితకు కార్తీక్ రెడ్డి, శృతి సంతానం. భర్త బొబ్బలి శేఖర్ రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు. తండ్రి ముస్కు కృష్ణా రెడ్డి, రిటైర్డ్ పి. ఇ. ఓ. తల్లి లక్ష్మమ్మ. తమ మా కుటుంబం, తమఅత్త గారి కుటుంబం విద్య మొత్తం నోముల పాఠశాలలో పూర్తి చేసినారన్నారు. ప్రస్తుతం తాను చదువుకున్న పాఠశాలలోనే విధులు నిర్వర్తించటం చాలా సంతోషనిస్తుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..