ఈ వీడియో ఎవరు చూసినా… షాకవుతారు. మళ్లీ మళ్లీ చూస్తారు. ఎందుకంటే.. అందులో ఇంటెన్సిటీ అలా ఉంది. చూస్తూ ఉండగానే.. ఆ మూడేళ్ల చిన్నారి.. అలా గాల్లోకి వెళ్లిపోయింది. అందనంత ఎత్తుకి చేరుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు బాగా స్పందిస్తున్నా్రు.
x లోని @InsaneRealitys అకౌంట్లో ఈ వీడియోని పోస్ట్ చేశారు. చూస్తుంటే.. అక్కడేదో కైట్ ఫెస్టివల్ జరుగుతున్నట్లు ఉంది. అక్కడ కొంతమంది పోటీదారులు.. ఓ భారీ గాలిపటాన్ని ఎగరేశారు, ఐతే.. ఆ గాలి పటం చివరి భాగం.. ఓ మూడేళ్ల చిన్నారిని చుట్టుకొని ఉందని వాళ్లు గ్రహించలేదు. అదే సమయంలో భారీగా ఈదురు గాలి రావడంతో.. ఆ గాలి పటం గాల్లోకి ఎగిరింది. దాంతో.. ఆ చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపోయింది.
ఈ దృశ్యాన్ని చూసిన వారు షాక్ అవ్వగా.. చిన్నారి తల్లిదండ్రులు.. కేకలు పెట్టారు. ఐతే.. అదృష్టం కొద్దీ.. ఆ పాప కింద పడిపోలేదు. పాపను పైకి లేపిన గాలే.. మళ్లీ మెల్లగా చిన్నారిని కిందకు దింపింది. ఐతే.. కొన్ని సెకండ్లపాటూ.. అక్కడున్న వారంతా.. చాలా కంగారు పడ్డారు. పాపను కాపాడేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. చివరకు చిన్నారి సురక్షితంగా దిగడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ వీడియోని ఇక్కడ చూడండి
3-year-old girl gets caught in kite and flies into the sky pic.twitter.com/Zx73BtlC6e
— Insane Reality Leaks (@InsaneRealitys) June 17, 2024
ఇది ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో వివరాలు లేవు. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. “బోయింగ్ కంటే సేఫ్గా దిగింది” అని ఒకరు కామెంట్ చెయ్యగా.. ఈ ఘటన జరుగుతున్నప్పుడు కొందరు మొబైల్లో వీడియో తీస్తుండటాన్ని తప్పుపడుతూ.. ఓ యూజర్.. “మనం ఇలాంటి రోజుల్లో జీవిస్తున్నాం” అని కామెంట్ ఇచ్చారు.
PM Kisan: రైతులకు భారీ హెచ్చరిక..
“నేను షాక్ అయ్యాను. ఆ చిన్నారి ఎటో వెళ్లిపోతుందేమో అనుకున్నాను. లక్కీగా సేఫ్గా దిగింది” అని మరో యూజర్ స్పందించారు. “వీడియో చూసి ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యాను. కానీ అక్కడ కొంతమంది మాత్రం సూపర్ మేన్ ఎగురుతున్నట్లు వీడియోలు తీసుకుంటున్నారు” అని మరో యూజర్ స్పందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..