పవన్ కళ్యాణ్ పై అభిమానం.. పెళ్లి కార్డుపై జనసేన ఫొటో.. – News18 తెలుగు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా సీట్లను సాధించడంతో పాటు.. అధికారంలోకి కూడా వచ్చింది. కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేందుకు ఎన్నికల ముందు చాలా కసరత్తే చేశాడు. అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ దే అని చెప్పవచ్చు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు నాయుడు కీలక శాఖలను కూడా అప్పగించారు. అంతే కాకుండా.. డిప్యూటీ సీఎంను కూడా చేసేశాడు. మొదటి నుంచి కూడా తన వెనుక ఉండి నడిపించిన కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు కూడా తెలియజేశాడు. సమస్య ఎక్కడ ఉన్నా అక్కడ నేను ఉంటానంటూ భరోసా కల్పించాడు.

Jobs: నిరుద్యోగులకు శుభవార్త..


Jobs: నిరుద్యోగులకు శుభవార్త..

ఇదిలా ఉంటే.. తన అభిమాని ఒకరు పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని ఓ ఆసక్తికరమైన రీతిలో వ్యక్తపరిచాడు. తన పెళ్లి కార్డులో పవన్ కళ్యాణ్ ఫొటోను ముద్రించి.. పెళ్లి కార్డులను బంధులవులకు పంచాడు. దీనికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కుటుంబరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని. పవన్ పుట్టిన రోజున ఎన్నో సార్లు రక్తదానం కూడా చేసిన రోజులు ఉన్నాయి. పవన్ నటించిన ఏ సినిమా అయినా మొదటి రోజే చేసేవాడు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అవ్వడంతో ఎంతో సంతోషించానని చెప్పుకొచ్చాడు. తనపై అభిమానాన్ని.. తన పెళ్లి కార్డులో జనసేనాని ఫోటో, అలాగే పార్టీ గుర్తును ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇది వాట్సాప్ గ్రూప్ ల ద్వారా సోషల్ మీడియాకు చేరి.. తెగ వైరల్ అవుతోంది. మరి ఫొటోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements