కాకతీయ కాలంనాటి కంటే ముందే చాళుక్యుల పరిపాలన కాలం లో లక్ష్మీ గణపతి స్వయంభుగా వెలిశాడు. 1985 సంవత్సరంలో వినాయకుడు పాలు తాగాడని అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో 1986, 87 సంవత్సరంలో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు రావడం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ తొండం అన్ని వినాయకులకు ఎడమవైపు ఉంటే ఇక్కడ కుడివైపు ఉండడం చాలా ప్రత్యేకత. దీనిపై సంక్షిప్త సమాచారం లోకల్ 18 ఛానల్ అందిస్తుంది.
వివరాల్లోకెళ్తే.. నకిరేకల్ పట్టణానికి చెందిన బ్రహ్మ దేవర రవిశంకర్ చెప్తున్న వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. 1986లో వినాయకుడు గ్లాసులో పెడితే పాలు తాగుతున్నాడని ఎంత మంది భక్తులు పెట్టినా గ్లాసుల్లో పాలు తాగేవాడు అని అప్పట్లో పత్రికల్లో ఛానల్ లో కూడా రావడంతో రాష్ట్ర నలుమూలల నుండి దేవుని దర్శనం కోసం వచ్చారు .
ఈ యొక్క దేవాలయం శివాలయానికి ఆనుకొని చాళుక్య పరిపాలన కాలంలో స్వయంగా వెలిసిన లక్ష్మీ గణపతి, ఈ యొక్క గణపతికి లక్ష్మీ గణపతి ఎలా పేరు వచ్చింది అంటే అన్ని వినాయక విగ్రహాలకు తొండం ఎడమవైపు ఉంటుంది ,కానీ ఈ యొక్క వినాయకునికి కుడి వైపున ఉండడం వల్ల ఆ పేరు రావడం జరిగింది. లక్ష్మీ అని పేరు ఉండడం వల్ల కొంతమంది దుండగులు యంత్ర తంత్రాలు తో విగ్రహం కింద మణులు మాణిక్యాలు దొంగలించడం జరిగింది.
PM Kisan: రైతులకు భారీ హెచ్చరిక..
దాని తర్వాత దేవాలయం పరిసర ప్రాంతంలో గుమ్మడికాయలు కొబ్బరికాయలు తిప్పేసి అక్కడికి వెళ్లిన వారు చనిపోతారని అవాస్తవం ప్రచారం చేశారు. దీనితో రాను రాను కాలక్రమమైన దేవాలయాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి వినాయక చవితికి భజన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు దీప నైవేద్యాలు అర్చకులతో పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చిన భక్తులకి పెళ్లిళ్లు కాని వారికి పెళ్లవ్వడం.. పిల్లలు లేని వారికి పిల్లలు అవ్వడం.. కోరుకున్న వారికి కొంగు బంగారమై కోరికలు నెరవేరుస్తున్నాడు అని లోకల్ 18 న్యూస్ ఛానల్ తో తెలియజేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..