Viral: ఈ రోజుల్లో చాలా మంది రోజూ చేసే డైలీ రొటీన్ వీడియోలు షేర్ చేయడం కామన్ అయిపోయింది. కంటెంట్ క్రియేటర్లు ఇలాంటి టాపిక్స్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. తినే తిండి నుంచి వేసుకునే దుస్తుల వరకు అన్నిటి గురించి వీరు వ్లాగ్స్ (Vlogs) చేస్తుంటారు. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక 37 ఏళ్ల మహిళ తన డైలీ రొటీన్‌ను వివరించింది. ముఖ్యంగా ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఏం చేస్తుందో చెప్పింది. ఈ మ్యారీడ్ ఉమెన్ క్రమశిక్షణ, డెడికేషన్ చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఆమెను ప్రశంసిస్తున్నారు, మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆమె వీడియోలో ఏం చెప్పిందంటే..
మనం మాట్లాడుకుంటున్న మహిళ పేరు క్రిస్టిన్ లైట్ (Kristin Leite). ఆమె టిక్‌టాక్ వీడియోలో 4AM-7AM మధ్య ఏం చేస్తుందో తెలిపింది. ఉదయం 4:26 గంటలకు భర్తకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ రెడీ చేస్తుంది. వీడియోలో “గుడ్ మార్నింగ్, ఫ్రెండ్స్! ఇప్పుడు ఉదయం 4:26 గంటలు. నా భర్త కోసం బ్రేక్‌ఫాస్ట్ శాండ్‌విచ్, లంచ్ మీల్ సిద్ధం చేస్తున్నా. అతను చాలా త్వరగా పనికి వెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి మేం ఉదయం పద్ధతిగా లేచి, మా కుక్కను వాక్‌కి తీసుకెళ్తాం. నా భర్త కోసం ఏం తయారు చేస్తున్నానో చూడండి.” అని ఆమె చెప్పింది.
షెడ్యూలు ఇదే..
ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు భర్తకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేయడమే కాకుండా, హాట్, కోల్డ్ కాఫీ కూడా తయారు చేస్తానని క్రిస్టిన్ వీడియోలో చెప్పింది. పెళ్లైనప్పటి నుంచి ఇది అలవాటు అయిపోయిందని, పెద్దగా ఇబ్బంది అనిపించదని తెలిపింది. తాము ఇద్దరం 13 ఏళ్లుగా సంతోషంగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నామని వెల్లడించింది.
ప్రపంచంలో భయంకరమైన జంతువులు..
న్యూస్‌వీక్ (Newsweek) వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన భర్త ఒక కమర్షియల్ డైవర్ అని, మెరైన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తారని క్రిస్టిన్ వివరించింది. ఈ రెండు ఉద్యోగాల కారణంగా అతడు తీరిక లేకుండా తన జీవితం గడుపుతున్నాడని పేర్కొంది. పని కోసం నెలల తరబడి ఇంటికి రాకుండా ఉండేవాడని చెప్పింది. ఇప్పుడు, అతడితో కొంచెం సమయం దొరికినా చాలా ప్రేమ కురిపిస్తానని ఆమె అంటోంది. భర్త కూడా చాలా ఆప్యాయత ప్రేమ చూపిస్తాడని చెబుతోంది. చాలామంది నెటిజన్లు ఆమె భర్తపై చూపించే ప్రేమను మెచ్చుకున్నారు. కొందరు మాత్రం విమర్శించారు.
విమర్శలకు కౌంటర్
కొంతమంది నెటిజన్లు ఈ వీడియోను చూసి, “నేను నా పిల్లలకు కూడా ఇంత చేయను. మీ హస్బెండ్ మీకు భర్తలా కాకుండా కొడుకులా వ్యవహరిస్తున్నాడు. మొత్తం పనులు మీతోనే చేయించుకుంటున్నాడు..” అని విమర్శించారు. కానీ క్రిస్టిన్ ఈ విమర్శలను పట్టించుకోవడం లేదు. “నాలో ఇలాంటి స్వభావం చిన్నప్పుడే ఏర్పడింది. మా అమ్మ మా నాన్నను ఎలా చూసుకునేదో చూసి నేను నేర్చుకున్నా. నాకు ఇది సహజంగా అనిపిస్తుంది. 13 ఏళ్లుగా ఇలానే జరుగుతోంది,” అని ఆమె చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..