Puzzle: ఈ గదిలో ఒక టూత్ బ్రష్ ఉంది.. 10 సెకన్లలో దాన్ని కనిపెడితే మీరు కేక!

Puzzle: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రోజూ బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ వైరల్‌ అవుతున్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ (Optical illusion puzzles) ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. వీటిని సాల్వ్ చేస్తుంటే అబ్జర్వేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, క్విక్ థింకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ పజిల్స్ పరిష్కరిస్తుంటే క్రియేటివ్‌గా ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఆప్టికల్ ఇల్యూషన్స్‌ కంటి చూపును, విజువల్ పర్సెప్షన్‌ను సవాలు చేస్తాయి. డైలీ వీటిని సాల్వ్ చేస్తుంటే బ్రెయిన్ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. ప్రస్తుతం ఒక డిఫికల్ట్ పజిల్ వైరల్‌గా మారింది.

ఈ పజిల్ ఇమేజ్‌ చూడండి. ఈ రూమ్‌లో ఒక బాలుడు బెడ్‌పై పడుకున్నాడు. గదిలో పిల్లి, కుక్క, పిగ్గీ బ్యాంక్, బొమ్మలు, పెయింటింగ్స్, బంతి.. ఇలా వస్తువులు, జంతువులు ఉన్నాయి. బయట గుడ్లగూబ కూడా కనిపిస్తోంది. ఈ పిల్లవాడు రేపు ఓ ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నాడు. ట్రిప్‌కి బయలుదేరే ముందు, తన టూత్‌బ్రష్‌ను ఎక్కడో పెట్టేసి మర్చిపోయాడు. ఆ టూత్‌బ్రష్‌ను కనిపెట్టడమే పజిల్ టాస్క్. దీనికి 10 సెకన్ల సమయం మాత్రమే ఇచ్చారు.

News18

టూత్‌బ్రష్‌ ఈ గదిలో ఎక్కడైనా ఉండవచ్చు. దాన్ని కనిపెట్టడానికి అబ్జర్వేషన్ స్కిల్స్ ఉపయోగించాలి. బ్రష్ వేరే వస్తువుల్లో కలిసిపోయి ఉండవచ్చు. కాబట్టి ఇమేజ్‌లోని ప్రతి ఆకారాన్ని శ్రద్ధగా గమనించాలి. మంచి కంటి చూపు, అద్భుతమైన అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నవారు మాత్రమే దీనిని 10 సెకన్లలో కనిపెట్టగలరు. మిగతా వారికి ఎక్కువ సమయం పట్టవచ్చు.

చిన్న హింట్

ఇన్ని వస్తువుల్లో చిన్న బ్రష్‌ని కనిపెట్టడం కొంచెం కష్టమే. అందుకే ఒక హింట్ కూడా ఇస్తున్నాం. అదేంటంటే పిల్లవాడి బెడ్‌ను బాగా గమనించాలి. దాని పైనే బ్రష్ ఉంది. టూత్ బ్రష్‌ను 10 సెకన్లలో గుర్తించారా? అయితే మీకు మంచి కంటి చూపు, ఏకాగ్రత, అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీన్ని కనిపెట్టడానికి లాజికల్‌గా కూడా ఆలోచించాల్సి ఉంటుంది కాబట్టి లాజికల్ థింకింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్పవచ్చు. దీనిని కనిపెట్టలేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. మరోసారి టైమర్ లేకుండా ప్రశాంతంగా బ్రష్ కనిపెట్టడానికి ట్రై చేయవచ్చు. ఒకవేళ ఎప్పటికీ కనిపెట్ట లేకపోతే కింద ఇచ్చిన సొల్యూషన్ చెక్ చేయవచ్చు.

News18

సొల్యూషన్

పైన ఇచ్చిన ఇమేజ్‌లో టూత్ బ్రష్‌ను రెడ్ కలర్‌తో సర్కిల్‌ చేశాం. బాలుడి బెల్టులో బ్రష్ కలిసిపోయింది. ఈ పజిల్‌ను ఎంజాయ్ చేసి ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసే సవాలు విసరవచ్చు. ఇలాంటి మరెన్నో పజిల్స్ కోసం న్యూస్ 18 తెలుగు వెబ్‌సైట్ విజిట్ చేయవచ్చు. వీటిని ఎంత ఎక్కువగా సాల్వ్ చేస్తే అంత ఎక్కువ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements