Snake In Amazon Order: బెంగళూరులోని ఓ జంటకు ఊహించన అనుభవం ఎదురైంది. రెండు రోజుల క్రితం అమెజాన్‌లో వచ్చిన పార్సిల్ చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తామకి వచ్చి ఆర్డర్ ప్యాకేజీలో పాము కనిపించడంతో షాక్ అయ్యారు.
2 రోజుల క్రితం అమెజాన్ నుండి ఎక్స్ బాక్స్ కంట్రోలర్‌ను బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లైన దంపతులు ఆర్డర్ చేశారు. అయితే వారికి డెలివరీ బాయ్ వారికి ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తుండగా.. నాగుపామును చూసి షాక్ అయ్యారు. అయితే ఆ పాము అదృష్టవశాత్తూ ప్యాకేజింగ్ టేప్‌కు అంటుకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో వారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్‌గా మారింది.
A family ordered an Xbox controller on Amazon and ended up getting a live cobra in Sarjapur Road. Luckily, the venomous snake was stuck to the packaging tape. India is not for beginners 💀
— Aaraynsh (@aaraynsh) June 18, 2024
ఈ విషయంపై అమెజాన్ సంస్థకు తెలపగా.. వారు బదులిచ్చారు. కస్టమర్ వీడియోపై స్పందిస్తూ అమెజాన్ ఇండియా కంపెనీ ట్వీట్ చేసింది. అమెజాన్ ఆర్డర్‌తో మీకు కలిగిన అసౌకర్యం కలిగినందుకు క్షమించాలని కోరింది. దీనిపై త్వరలోనే మీకు పూర్తి వివరణ ఇస్తాము. వారు చెల్లించిన మొత్తాన్ని కూడా వారికి తిరిగి చెల్లించింది.
మీరు గుడ్లు తినరా? అయితే వీటిని తప్పక తినాల్సిందే..!
అయితే ఆ సాఫ్ట్‌వేర్ జంట తమ ఆర్డర్‌లో వచ్చిన పామును సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో వారి అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే చాలా మందికి ఇలాంటి రకరకాల అనుభవాలు ఎదురైన సంఘటనలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..